కిరణ్ కు ''రాష్ట్రీయ సమాజ్ సేవా రత్న'' పురస్కారం

- November 08, 2020 , by Maagulf
కిరణ్ కు \'\'రాష్ట్రీయ సమాజ్ సేవా రత్న\'\' పురస్కారం

'మనం సైతం' సేవా సంస్థ ద్వారా పేదలను ఆదుకుంటున్నారు నటులు కాదంబరి కిరణ్. చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్ట్ ల వారితో పాటు సంస్థ సాయం కోరిన ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తున్నారు. కాదంబరి చేస్తున్న సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ ఏడాది ''రాష్ట్రీయ సమాజ్ సేవా రత్న'' పురస్కారం దక్కింది. అక్టోబర్ 31న ప్రకటించిన ఈ అవార్డ్ ఆదివారం (నవంబర్ 8న) ఆయనకు చేరింది. ఢిల్లీ ప్రభుత్వ గుర్తింపు పొందిన 'ది గ్లోబల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్' వారు ఈ ''రాష్ట్రీయ సమాజ్ సేవా రత్న'' పురస్కారాన్ని కళలు, సామాజిక సేవ, వైద్య, వ్యాపారం వంటి రంగాల్లో ఏటా అందిస్తుంటారు. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల నుంచి కాదంబరి కిరణ్ ను సేవా విభాగంలో ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ...మనం సైతం సేవా సంస్థ ద్వారా వేలాది మందికి సహాయం చేసే అదృష్టం నాకు దక్కింది. ఈ సేవా కార్యక్రమాలకు రాష్ట్రీయ సమాజ్ సేవా రత్న పురస్కారం దక్కడం నిజంగా ప్రోత్సాహకరం. నా సేవకు దొరికిన గుర్తింపుగా భావిస్తున్నాను. వినయంగా అవార్డును స్వీకరిస్తున్నాను. చేతనైన సాయం కోసం ఎప్పుడైనా ఎక్కడైనా, ఎవరికైనా..మనం సైతం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నా. అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com