కరోనా ట్రీట్మెంట్ నిలిపేశారంటూ ప్రచారం..రూమర్స్ గా కొట్టి పారేసిన అధికారులు
- November 08, 2020
మస్కట్: ఒమన్ లోని కొన్ని ఆస్పత్రుల్లో కోవిడ్ 19 డిపార్ట్మెంట్ ను మూసివేశారని, ఇక కరోనా ట్రీట్మెంట్ చేయరంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వ సమాచార కేంద్రం కొట్టిపారేసింది. సుల్తానేట్ పరిధిలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా చికిత్సను పూర్తిగా నిలిపివేశారని, ఇక నుంచి కోవిడ్ వార్డులో పేషెంట్లను చేర్చుకోరంటూ ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయం ప్రభుత్వ యంత్రాంగం వరకు వెళ్లటంతో కోవిడ్ ట్రీట్మెంట్ కు సంబంధించి ప్రభుత్వ సమాచార కేంద్రం స్పష్టతను ఇచ్చింది. సుల్తానేట్ పరిధిలో ట్రీట్మెంట్ నిలిపివేశారని చెబుతున్న ప్రచారంలో నిజం లేదని, మిగిలిన ఆస్పత్రుల తరహాలోనే ఆ ఆస్పత్రిలో కూడా కోవిడ్ పేషెంట్లను చేర్చుకొని చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







