కోవిడ్ 19: అబుధాబికి చేరుకునే ప్రయాణికులకు కొత్త నిబంధనలు నేటి నుంచే అమలు
- November 08, 2020
అబుధాబి: కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణ కోసం అబుధాబి పాలక యంత్రాంగం జారీ చేసిన కొత్త నిబంధనలు ఆదివారం నుంచి అమలులోకి వచ్చాయి. ఇక నుంచి యూఏఈ రాజధానికి చేరుకునే ప్రయాణికులు పలు మార్లు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. నాలుగు రోజలు ఉండే వారు ఒకసారి, 8 రోజులు ఉండే వారు రెండుసార్లు ఖచ్చితంగా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. గత జూన్ నుంచి అమలులో ఉన్న నిబంధనల ప్రకారం అబుధాబికి వచ్చే విమాన ప్రయాణికులు అందరూ ప్రయాణ సమయానికి 48 గంటలలోపే పీసీఆర్ టెస్టు చేయించుకోవాలి. లేదంటే డీపీఐ బ్లడ్ టెస్ట్ ద్వారా కోవిడ్ లేదని నిర్ధారణ అయిన తర్వాతే అబుధాబిలోకి అనుమతి ఇస్తారు. ఈ నిబంధన యధావిధిగా అమలులో ఉంటుంది. ఇక కొత్తగా అమలులోకి వచ్చిన రూల్స్ ప్రకారం..అబుధాబిలో చేరుకున్నాక వరుసగా నాలుగు రోజులు ఉంటే అబుధాబిలో అడుగుపెట్టిన రోజు నుంచి నాలుగో రోజున కోవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి. అంటే ఆదివారం అబుధాబికి చేరుకుంటే బుధవారం రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎనిమిది రోజులకు మించి అబుధాబిలో ఉంటే 8వ రోజున కూడా మరోసారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవటం తప్పనిసరి. అంటే బుధవారం తొలిసారి, ఆదివారం మరోసారి ఇలా 8 రోజుల వ్యవధిలో రెండుసార్లు టెస్ట్ చేయించుకోవాల్సిందేనని అబుధాబి కోవిడ్ 19 అత్యవసర, విపత్తుల నిర్వహణ కమిటీ తమ కొత్త నిబంధనల్లో సూచించింది. ఇక టెస్టు ఫీజుల విషయానికి వస్తే...ప్రయాణికుడు ఎంచుకున్న టెస్టును బట్టి ధర చెల్లించాల్సి ఉంటుంది. పీసీఆర్ టెస్టు చేయించుకునే వారు DH180, డీపీఐ బ్లడ్ టెస్టుకైతే Dh 150 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ అబుధాబిలో అడుగుపెట్టిన నాలుగో రోజున కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోకుంటే జరిమానా ఎదుర్కొవాల్సి వస్తుందని కమిటీ హెచ్చరించింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు