హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 24X7 మహిళా హెల్ప్ డెస్క్ ప్రారంభం

- November 09, 2020 , by Maagulf
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో  24X7 మహిళా హెల్ప్ డెస్క్ ప్రారంభం

హైదరాబాద్:సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సిజ్జనార్ నేడు జిఎంఆర్ ఆధ్వర్యంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రదీప్ పణికర్, సిఇఒ, GHIAL;ఎంకే సింగ్, డీఐజీ, సీఐఎస్‌ఎఫ్,మరియు పోలీసు శాఖ, విమానాశ్రయానికి చెందిన ముఖ్య అధికారుల సమక్షంలో 24 గంటలూ పని చేసే మహిళా హెల్ప్ డెస్క్‌ను ప్రారంభించారు. ఈ మహిళా హెల్ప్‌డెస్క్ అరైవల్స్ లెవల్‌లోని తూర్పు భాగంలో ఏర్పాటు చేసారు. 

ఈ ఉమెన్ హెల్ప్ డెస్క్‌లో మహిళా పోలీసు సిబ్బంది ఉంటారు. ఎవరైనా ఆపదలో ఉన్న మహిళలకు ఉమెన్ హెల్ప్ డెస్క్‌ సహాయం అందిస్తుంది.హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్ర పోలీసు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) మరియు సెక్యూరిటీ ఏజెన్సీ రక్షా లాంటి భద్రతా ఏజెన్సీలతో కలిసి పని చేస్తూ ప్రతి ఒక్కరికీ సురక్షితమైన వాతావరణాన్ని అందిస్తుంది. విమానాశ్రయ కార్యకలాపాల పున:ప్రారంభం తరువాత, విమానాశ్రయం నుంచి రోజుకు దాదాపు 25 వేల మంది ప్రయాణికులు వస్తూ పోతున్నారు. వీరిలో మహిళా ప్రయాణీకులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. విమానాశ్రయంలో 24 గంటలూ పని చేసే మహిళా హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేయడం వల్ల మహిళా ప్రయాణికులు, సందర్శకులు మరియు విమానాశ్రయ ఉద్యోగులకు మరింత భద్రత చేకూరుతుంది.

ఈ సందర్భంగా ప్రదీప్ పణికర్, సిఇఒ, GHIAL మాట్లాడుతూ, “RGIA లో 24 గంటలూ పని చేసే మహిళా హెల్ప్‌డెస్క్ ఏర్పాటు  స్వాగతించదగిన విషయం. తెలంగాణ స్టేట్ పోలీస్ అండ్ సేఫ్టీ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ (SHE) బృందం చొరవతో ఈ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినందుకు ప్రయాణీకులు, విమానాశ్రయ సిబ్బంది తరపున నేను సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ విసి సిజ్జనార్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.ఈ హెల్ప్ డెస్క్ ఆరంభించడం వల్ల విమానాశ్రయం నుంచి వెళ్ళే మహిళలందరికీ భద్రత లభిస్తుంది. ఇది అవసరమైన వారందరికీ అందుబాటులో ఉంటుంది. ” అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com