క్వాడ్‌ బైక్‌ ప్రమాదంలో ఇద్దరు మృతి

- November 09, 2020 , by Maagulf
క్వాడ్‌ బైక్‌ ప్రమాదంలో ఇద్దరు మృతి

అబుధాబి:అల్‌ అయిన్‌లో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు ఎమిరాతీలు ప్రాణాలు కోల్పోయారు. అబుధాబి పోలీస్‌ వెల్లడించిన వివరాల ప్రకారం క్వాడ్‌ బైక్‌ మీద వెళుతూ అత్యంత నిర్లక్ష్యంగా ప్రయాణించడం వల్లనే ఈ ప్రమాదాలు జరిగినట్లు చెప్పారు. మొదటి ఘటన నహాల్‌ రీజియన్‌లో జరగగా, రెండో ఘటన సీహ్‌ సబ్రాహ్‌లో జరిగింది. సోషల్‌ మీడియా వేదికగా ఎంతగా ప్రచారం చేస్తున్నా రెక్లెస్‌ డ్రైవింగ్‌ చేయడం మాత్రం మానడంలేదని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఇతరు భద్రత, తమ భద్రత దృష్టిలో పెట్టుకుని వాహనాలు నడపాలని పోలీసులు సూచిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com