కోవిడ్‌ హెల్త్‌ కవరేజ్‌పై ఒమన్‌ ఎయిర్‌ ప్రకటన

- November 09, 2020 , by Maagulf
కోవిడ్‌ హెల్త్‌ కవరేజ్‌పై ఒమన్‌ ఎయిర్‌ ప్రకటన

మస్కట్‌: ఒమన్‌ ఎయిర్‌ ప్రయాణీకులకు కోవిడ్‌ హెల్త్‌ కవరేజ్‌ 31 రోజుల పాటు వర్తిస్తుందని, రెసిడెంట్‌ కార్డ్‌ వుండి సుల్తానేట్‌కి వస్తున్నవారికి మాత్రం ఈ కవరేజ్‌ వర్తించదని ఒమన్‌ ఎయిర్‌ పేర్కొంది. ఒమన్‌ ఎయిర్‌ ద్వారా టిక్కెట్లను బుక్‌ చేసుకోవాల్సి వుంటుందనీ, ఈ క్రమంలో కోవిడ్‌ 19 కవరేజ్‌ ఆటోమేటిక్‌గా దక్కుతుందనీ, మెడికల్‌ మరియు క్వారంటైన్‌ ఖర్చుల కోసం ఇది ఉపయోగపడుతుందని ఒమన్‌ ఎయిర్‌ వివరించింది. ప్రయాణం మొదటి రోజు నుంచి 31 రోజుల పాటు ఈ కవరేజీ వర్తిస్తుంది. ప్రీ అప్రూవల్‌ అనేది సంబంధిత నియమాలకు లోబడి వుంటుంది. అక్టోబర్‌ 1 నుంచి జారీ చేసే టిక్కెట్లకు మార్చి 31 వరకు ఈ కవరేజీ వర్తిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com