యూపీలో తుఫాన్ బీభత్సం...74 మంది మృతి!
- May 14, 2026
ఉత్తర్ ప్రదేశ్ లో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. బుధవారం సాయంత్రం నుంచి 74మంది మృతి చెందారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.భదోహి, బుడౌన్ జిల్లాల్లో భారీ వానలతో పాటు ఈదురు గాలులు అలజడి సృష్టించాయి. అనేక మంది గాయపడ్డారు.విద్యుత్తు సరఫరాను నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
సహాయక చర్యలు...
మొబైల్ నెట్ వర్క్ లుకూడా పనిచేయలేదు. కొందరు తీవ్రగాయాలపాలయ్యారు.గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. విద్యుత్తు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. అలాగే పడిపోయిన చెట్లను కూడా తొలగిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- తాను చదువుకున్న పాఠశాలకు మిస్ యూనివర్స్ కాజియా పునరాగమనం
- అక్టోబర్ 1 నుంచి యూఏఈ పుస్తక దుకాణాల్లో షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ‘ది లెటర్స్’
- NATS ఆధ్వర్యంలో దిగ్విజయంగా ‘అడాప్ట్ ఎ పార్క్' కార్యక్రమం
- ఎతిహాద్ రైల్ దుబాయ్ స్టేషన్ ప్రారంభం..సెప్టెంబర్ 30 నుంచి ప్రయాణికుల సేవలు
- భారత్–షార్జా వాణిజ్య, పెట్టుబడుల సహకారంపై చర్చలు
- విశాఖ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- రూ.20కే రెండు లక్షల ప్రమాద బీమా
- భారత్–యూఏఈ పెట్టుబడుల భాగస్వామ్యంపై కీలక చర్చలు
- తెలంగాణా రాష్ట్రంలో తెలుగుభాషా దినోత్సవం
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ఇద్దరి అరెస్ట్..!!







