ఒమన్-భారత్ మధ్య విమాన ప్రయాణికుల సంఖ్యలో కోత..
- November 10, 2020
మస్కట్:భారత్-భారత్ మధ్య ప్రయాణికుల సంఖ్యలో భారీ కోత పడింది. విమానాల్లో సీట్ల లభ్యత సగానికి సగం తగ్గనుంది. ఈ మేరకు ఒమన్-భారత్ మధ్య జరిగిన ఎయిర్ బబుల్ ఒప్పందంలో సవరణలు జరిగాయి. ఈ సవరణల ప్రకారం భారత్-ఒమన్ మధ్య ఇక నుంచి వారానికి 5 వేల మంది ప్రయాణికులకే అనుమతి ఇస్తారు. అంటే ఒక వారంలో ఒమన్ నుంచి భారత్ కు ప్రయాణించే వారి సంఖ్య...భారత్ నుంచి ఒమన్ కు ప్రయాణించే వారి సంఖ్య గరిష్టంగా 5 వేల మందికి మాత్రమే పరిమితం కానుంది. రెండు దేశాల ఎయిర్ వేస్ లను కలుపుకుంటే 10 వేల మంది వరకు ప్రయాణానికి అనుమతి ఉంటుంది. భారత్ నుంచి ఒమన్ కు ప్రయాణించిన కొందరు ప్రయాణికులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ కావటంతో ఒమన్ ప్రభుత్వం ఈ సవరణలను ప్రతిపాదించింది. ఈ మేరకు గత నెల 29న ఒమన్ పౌర విమానయాన అధికార విభాగం..భారత్ కు లేఖ రాసింది. నవంబర్ 9 నుంచి ఎయిర్ బబుల్ ఒప్పందంలో సవరణలు అమలు చేయాలని కోరుతూ..వారానికి 5000 సీట్లనే అనుమతించాలని అభ్యర్ధించింది. అయితే..ఏయే ఎయిర్ వేస్ కు ఎన్ని సీట్లు ఇస్తారనేది భారతీయ అధికారుల ఆధ్వర్యంలో తీసుకోవాల్సిన నిర్ణయమని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులు...ప్రభుత్వ రంగ విమానయాన సంస్థలు ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ కు మాత్రమే అనుమతి ఇచ్చారు. దీంతో ఇండిగో, స్పైస్ జెట్, గో ఎయిర్ సంస్థలు ఒమన్ కు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఇటీవలె ప్రకటించిన విషయం తెలిసిందే.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు