వీసా గడువు ముగిస్తే నవంబర్ 30 కల్లా వెళ్లిపోవాల్సిందే..

- November 10, 2020 , by Maagulf
వీసా గడువు ముగిస్తే నవంబర్ 30 కల్లా వెళ్లిపోవాల్సిందే..

కువైట్ సిటీ:విజిట్ వీసాదారులు, నివాస అనుమతుల గడువు ముగిసిన వారు ఈ నెలాఖరు నాటికి దేశం విడిచి వెళ్లాల్సిందేనని కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వీసా గడువు ముగిసిన వారికి నవంబర్ 30 వరకు గడువు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే..ప్రభుత్వం విధించిన గడువు ముగుస్తుండటంతో మరోసారి పర్యాటకులు, ప్రవాసీయులను దృష్టిలో ఉంచుకొని ఈ మేరకు హెచ్చరించింది. నవంబర్ 30లోగా వీసా, రెసిడెన్సీ అనుమతులను రెన్యూవల్ చేసుకోవాలని, లేదంటే డెడ్ లైన్ లోగా దేశాన్ని విడిచివెళ్లాలని తమ ప్రకటనలో మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రవాస ఉద్యోగులకు సంబంధించి ఆయా యాజమాన్యాలు మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ద్వారాగానీ లేదంటే ఆయా గవర్నరేట్ పరిధిలోని రెసిడెన్సీ అఫైర్స్ డిపార్ట్మెంట్ ద్వారాగానీ నిర్ణీత గడువు ముగిసేలోగా మళ్లీ రెన్యూవల్ చేయించాలని సూచించింది. నవంబర్ 30 నాటికి ఏ కారణం చేతనైనా గడువు ముగిసిన వీసాదారులు దేశం విడిచి వెళ్లకపోతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఉల్లంఘునులు మళ్లీ దేశానికి తిరిగి వచ్చే అవకాశాన్ని కొల్పోతారని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com