భారత దేశ వ్యాప్తంగా బీజేపీ హవా..గుజరాత్,మధ్యప్రదేశ్,తెలంగాణ,బీహార్ లో విజయం

- November 10, 2020 , by Maagulf
భారత దేశ వ్యాప్తంగా బీజేపీ హవా..గుజరాత్,మధ్యప్రదేశ్,తెలంగాణ,బీహార్ లో విజయం

భారత దేశ వ్యాప్తంగా జరగుతున్న పలు ఉప ఎన్నికల్లో బీజేపీ హవా సాగుతోంది. విపక్షాలను చిత్తు చేస్తూ విజయం దిశగా పయనిస్తోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌ లో బీజేపీ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. గుజరాత్ లో మొత్తం 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా..ఇప్పటివరకు 1స్థానంలో విజయం సాధించిన బీజేపీ..మిగిలిన 7స్థానాల్లో కూడా ఆధిక్యంలో కొనసాగుతోంతది.

రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌కు చెందిన ఎనిమిది మంది శాసనసభ్యులు బీజేపీలోకి ఫిరాయించడంతో ఈ ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే సిట్టింగ్‌ స్థానాలను తిరిగి నిలబెట్టుకోవాలనుకున్న కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఓటమి దిశగా పయనిస్తోంది. దీంతో గత అసెం‍బ్లీ ఎన్నికల్లో ఏర్పడ్డ లోటును బీజేపీ పూడ్చుకుంది.

కొద్ది సేపటిక్రితం గుజరాత్ సీఎం గాంధీనగర్ లో బీజేపీ వర్కర్లతో సీఎం విజయ్ రూపానీ సమావేశమై..కాషాయ సంబరాల్లో పాల్గొన్నారు.

దేశ వ్యాప్తంగా ఆసక్తిరేకెత్తించిన మధ్య ప్రదేశ్‌ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ దూసుకుపోతోంది. మొత్తం 28 స్థానాల్లో బీజేపీ 21, కాంగ్రెస్ 6, బీఎస్పీ 1 ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. దీంతో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ ప్రభుత్వం గండం నుంచి గట్టెక్కినట్లైంది. ఇక కాంగ్రెస్‌ తిరుగుబాటు నేత జోతిరాధిత్య సింధియా తన పట్టును నిలుపుకున్నారు. తన వెంట వచ్చిన ఎమ్మెల్యేలంతా గెలుపు దిశగా పయనిస్తున్నారు.

బీహార్‌లో కూడా ఎన్డీయే కూటమి మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం…ఎన్డీయే కూటమి 18 స్ధానాల్లో గెలుపొంది 107 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, ఆర్జేడీ సారథ్యంలోని మహాకూటమి 9 స్ధానాల్లో గెలుపొంది 97 స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎల్జేపీ 2 స్ధానాల్లో, ఇతరులు 10 స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిపై ఎన్డీయే స్పష్టమైన ఆధిక్యం కనబరచడంతో బీజేపీ మహిళా మోర్చా సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. ఢోలక్‌ మోగించడంతో పాటు రంగులు చల్లుతూ హర్షం వ్యక్తం చేశారు. ఎల్జేపీ 2 స్ధానాల్లో, ఇతరులు 10 స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

ఇక,తెలంగాణలో కూడా దుబ్బాక నియోజకవర్గంలో సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆకస్మిక మరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. దుబ్బాకలో కూడా బీజేపీ విజయం సాధించే దిశగా బీజేపీ దూసుకెళ్తోంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com