ఒమన్:ఈ నెల 15 నుంచి మసీదుల్లో ప్రార్ధనలకు అనుమతి

- November 11, 2020 , by Maagulf
ఒమన్:ఈ నెల 15 నుంచి మసీదుల్లో ప్రార్ధనలకు అనుమతి

మస్కట్:8 నెలలుగా మసీదుల్లో ప్రార్ధనలకు దూరమైన భక్తులకు ఒమన్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ నెల 15 నుంచి మసీదుల్లో ప్రార్ధనలు చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. కోవిడ్ నేపథ్యంలో గత మార్చి నుంచే సామూహిక ప్రార్ధనలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే..జనజీవనం సాధారణ స్థితికి చేర్చటంలో భాగంగా పలు రంగాలకు అనుమతి ఇస్తూ వస్తున్న ఒమన్ ప్రభుత్వం...ఎట్టకేలకు మసీదుల్లో ప్రార్ధనలకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. మినిమం 400 మంది భక్తులు ప్రార్ధనలు చేసుకునే సామర్ధ్యం కలిగిన మసీదుల్లో భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే..కోవిడ్ నేపథ్యంలో అన్ని ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. భౌతిక దూరం పాటించటంతో పాటు..సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలని, ఫేస్ మాస్కులు విధిగా ధరించాలని పేర్కొంది. రోజులో ప్రార్ధాన చేసే సమయంలో 25 నిమిషాల పాటే మసీదు తెరవబడి ఉంటుంది. అయితే..శుక్రవారాల్లో మాత్రం ఆంక్షలు యధావిధిగా కొనసాగుతాయి. ఇదిలాఉంటే..ఎట్టకేలకు మసీదుల్లో ప్రార్ధనలకు ప్రభుత్వం అనుమతివ్వటం పట్ల ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియా ద్వారా తమ ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కోవిడ్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com