దుబ్బాక ప్రజలకు ప్రధాని మోడి ధన్యవాదాలు

- November 11, 2020 , by Maagulf
దుబ్బాక ప్రజలకు ప్రధాని మోడి ధన్యవాదాలు

న్యూఢిల్లీ: దుబ్బాక ఉప ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయంపై ప్రధాని నరేంద్రమోడి మాట్లాడుతూ..ఈ విజయం చారిత్రాత్మకమన్నారు. బిజెపిని గెలిపించిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బిజెపి గెలుపు కోసం కార్యకర్తలు ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. రాష్ట్రాభివృద్ధిలో ఈ విజయం తమకు మరింత శక్తినిస్తుందని అన్నారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై బిజెపి అభ్యర్థి రఘునందన్‌రావు 1,079 ఓట్లతో విజయం సాధించారు. గెలిచిన రఘునందన్‌రావుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దుబ్బాకలో విజయం సాధించేందుకు కృషి చేసిన కార్యకర్తలు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు షా అభినందనలు తెలిపారు. టిఆర్‌ఎస్‌ అవినీతికి, రాచరిక పాలనకు వ్యతిరేకంగా ఈ ఫలితాలు వెలువడ్డాయని నడ్డా అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com