బహ్రెయిన్లో ఇతరులకు సబ్సిడీ కట్

- May 27, 2015 , by Maagulf
బహ్రెయిన్లో ఇతరులకు సబ్సిడీ కట్

ప్రపంచ వ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన చమురు ధరలతో, చమురు ఎగుమతులమీదే ఆధారపడ్డ గల్ఫ్ దేశాల్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ కారణంగా, కొన్ని దేశాలు తమ దేశ పౌరులకు అందించే సబ్సిడీ విషయంలో పునరాలోచనలో పడ్డాయి. బహ్రెయిన్లో ‘ఇతరులకు’ సబ్సిడీ కట్ చేయాలనుకుంటున్నట్లు ఇన్ఫర్మేషన్ అఫైర్స్ మంత్రి ఇసా బిన్ అబ్దుల్రెహ్మాన్ అలా హమాదీ చెప్పారు. విదేశాల నుంచి బహ్రెయిన్లో స్థిరపడ్డవారికి బహ్రెయిన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీలూ అందబోవని ఆయన చెప్పారు. కేవలం బహ్రెయిన్ ‘లోకల్స్’కి మాత్రమే సబ్సిడీ అందించేలా చర్యలు తీసుకుంటున్నామని అల్ హామాదీ వివరించారు. సబ్సిడీపై లభించే అన్ని వస్తువుల ధరలూ ఇతరులకు ఇకపై చుక్కలు చూపించనున్నాయి. ఫ్యూయల్, మీట్, ఎలక్ట్రిసిటీ, వాటర్ వంటి వాటి ధరలపై ఈ సబ్సిడీ కట్ ప్రభావం చూపనుంది.

                                     --- యం.వాసుదేవ రావు (బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com