షార్జాలో బలవన్మరణానికి పాల్పడ్డ భారతీయ ఇంజనీరింగ్ విద్యార్థి
- November 11, 2020
షార్జా: ఓ ఇండియన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ బలవన్మరణానికి పాల్పడటంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖానికి లోనయ్యారు. మృతుడ్ని జ్యోత్‌గా గుర్తించారు. అల్ రోల్లాలోని ఓ అపార్ట్మెంట్లో జ్యోత్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ప్రస్తుతానికి ఎలాంటి అనుమానాలూ లేవనీ, జ్యోత్ బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించామనీ, విచారణ జరుగుతోందని పోలీసు అధికారులు వెల్లడించారు. మృతుడి సోదరుడు నిరాల్ మాట్లాడుతూ, జ్యోత్ మరణాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని చెమర్చిన కళ్ళతో చెప్పాడు. కంప్యూటర్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు మృతుడు జ్యోత్. స్టడీస్‌లో ఉన్నతంగా రాణించేవాడనీ, ఎందుకు ప్రాణాలు తీసుకున్నాడో అర్థం కావడంలేదని మృతుడి ఫ్రెంట్స్ చెబుతున్నారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







