హోవర్ బోర్డ్స్‌ని నిషేధించిన దుబాయ్
- February 16, 2016
దుబాయ్ సిటీలో హోవర్ బోర్డ్సని నిషేధించారు. ఈ నిర్ణయంతో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ స్కూటర్స్‌ని ఇప్పటికే బ్యాన్ చేసిన న్యూయార్క్, నెథర్లాండ్స్, యూకే, హాంగ్‌కాంగ్, న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియా సరసన దుబాయ్ చేరింది. పబ్లిక్ ప్రాంతాల్లో హోవర్ బోర్డ్స్‌ని బ్యాన్ చేస్తున్నట్లు దుబాయ్ మున్సిపాలిటీ వర్గాలు ప్రకటించాయి. రద్దీగా వుండే ప్రాంతాల్లో, సైడ్ వాక్స్‌లో, రోడ్స్ మరియు ఇతర పబ్లిక్ ప్రాంతాల్లో హోవర్ బోర్డుల్ని నిషేధించినట్లు పబ్లిక్ హెల్త్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ డిప్యూటీ హెడ్ సుల్తాన్ అల్ సువ్వాది చెప్పారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కుల్లో మాత్రమే హోవర్ బోర్డుల్ని వినియోగించాలి. హోవర్ బోర్డ్స్ వినియోగించేటప్పుడు చేతికి, తలకి, మోకాళ్ళకీ తగిన భద్రత ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు. తయారీ కంపెనీ సూచనల మేరకు ఛార్జింగ్ చేయవలసి ఉంటుందనీ, భద్రత విషయంలో జాగ్రత్త వహించాలని అధికారులు చెప్పారు. హోవర్ బోర్డ్‌పై పయనిస్తూ రోడ్డుపై వెళ్ళే కారు ఢీ కొని ఆరేళ్ళ కుర్రాడు అబుదాబీలో చనిపోవడంతో అప్పటినుంచీ హోవర్ బోర్డ్‌పై నిబంధనల్ని కఠినతరం చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







