జైలు నుంచి అర్నాబ్ గోస్వామి విడుదల
- November 11, 2020
ముంబై: రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్, జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామికి మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో ఆయన తలోజా జైలు నుంచి విడుదలయ్యారు. జస్టిస్ చంద్రచుడ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం అర్నాబ్‌ను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. ఆయనకు ఊరట లభించింది. జైలు నుంచి విడుదల అయిన అర్నాబ్ కొద్ది దూరం రోడ్ షో నిర్వహించారు. ఆయనకు మద్దతు తెలిపేందుకు చాలామంది రావడం విశేషం. దీంతో.. కారులో నుంచే అర్నాబ్ వారికి అభివాదం చేశారు.
రిపబ్లిక్ టీవీ బకాయిలు చెల్లించలేదన్న కారణంగా ఆర్కిటెక్ట్- ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారంటూ అర్నాబ్ సహా మరో ఇద్దరిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిపై ఐపీసీ సెక్షన్ 304 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), సెక్షన్ 34 (ఒకే ఉద్దేశంతో నిందితులు ఏకంకావడం) తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది. అర్నాబ్‌ను శివసేన ప్రభుత్వం కుట్రపూరితంగా అరెస్ట్ చేయించిందన్న వాదనను బీజేపీ తెరపైకి తెచ్చింది. దీంతో.. అర్నాబ్ అరెస్ట్ రాజకీయానికి దారితీసింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు