34 నిషేధిత దేశాల నుంచి కూడా ప్రయాణికులకు అనుమతి..క్వారంటైన్ తప్పనిసరి
- November 12, 2020
కువైట్ సిటీ:కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 24 గంటల పాటు సేవలు ప్రారంభించాలని నిర్ణయించిన సివిల్ ఏవియేషన్ ఆథారిటీ..అందుకు అనుగుణంగా వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతి కోసం వేచి చూస్తున్నట్లు ప్రకటించింది. వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి ప్రకటన వెలువడితే ఈ నెల 17 నుంచి 24 గంటల పాటు ఎయిర్ పోర్టు సేవలు ప్రారంభిస్తామని వెల్లడించింది. మరోవైపు కరోనా తీవ్రత అధికంగా ఉన్న 34 దేశాలపై కువైట్ క్లారిటీ ఇచ్చింది. నిషేధ జాబితాలో ఉన్న ఆ 34 దేశాల నుంచి కువైట్ కు తిరిగి వచ్చేవారి కోసం ప్రత్యేకంగా క్వారంటైన్ నిబంధనలు పాటించాలని సూచించింది. బ్యాన్డ్ కంట్రీస్ నుంచి వచ్చే వారు హోం క్వారంటైన్ లో ఉండేందుకు వీలు లేదని తెలిపింది. వాళ్లంతా ఖచ్చితంగా వారం రోజుల పాటు హోటల్ క్వారంటైన్ లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఏడో రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని..టెస్టులో నెగటివ్ వస్తే క్వారంటైన్ గడువు ముగుస్తుంది..పాజిటివ్ క్వారంటైన్ కొనసాగించాలని వెల్లడించింది. హోటల్ క్వారంటైన్, పీసీఆర్ టెస్ట్ ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. అంతేకాదు..నిషేధిత జాబితాలో ఉన్న ఆ 34 దేశాల నుంచి వచ్చే వారిని రిసీవ్ చేసుకునేందుకు ఎవరిని అనుమతించబోమని, ఆ ప్రయాణికులే స్వయంగా హోటల్ కు వెళ్లేలా రవాణా ఏర్పాట్లు కూడా చేసుకోవాలని సివిల్ ఏవియేషన్ అథారిటీ స్పష్టం చేసింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..