ప్రపంచంలో తొలి 6 జీ ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా
- November 12, 2020
అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవటంలో పోటీపడుతున్న చైనా మరో సంచలన ప్రయోగాన్ని స్టార్ట్ చేసింది. ప్రపంచలోని చాలా దేశాలు ఇంకా 5జీ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోలేక అవస్థలు పడుతుంటే డ్రాగన్ కంట్రీ మాత్రం అప్పుడే 6జీ వైపు దూసుకువెళ్తోంది. 6జీ కోసం శాటిలైట్ ను కక్ష్యలోకి విజయవంతంగా పంపించింది. 6జీ టెక్నాలజీ చైనా చేతికి వస్తే ఏం అవుతుంది.? ప్రపంచ గమనంపై 6జీ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం.
టెలికమ్యూనికేషన్, డిజిటల్ రంగాల్లో ఇప్పటివరకు 5జీ టెక్నాలజీ అత్యుత్తమైమనది. ప్రపంచంలోని 34 దేశాలు, 378 నగరాల్లో మాత్రమే ప్రస్తుతానికి 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక మన ఇండియా విషయానికి వస్తే ఇప్పటికీ 4జీ సేవలనే పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నాం. 5జీ రేసులో ప్రపంచ దేశాలతో వెనుకబడిపోయాం. అన్ని సజావుగా జరిగితే ఈ ఏడాది చివర్లోగానీ, వచ్చే ఏడాది ఫస్ట్ క్వార్టర్ లోగానీ 5జీ సేవలు మన దేశంలో ప్రారంభం కావొచ్చు. టెక్నాలజీని అడాప్ట్ చేసుకోటంలో మనం కాస్తా నెమ్మదిగానే కదులుతున్నా..ప్రపంచ దేశాలు మాత్రం పోటాపోటీగా పరుగులు పెడుతున్నాయి. మరో పదేళ్లు అంటే 2030 నాటికి టెలికమ్యూనికేషన్ రంగం, డిజిటల్ వరల్డ్ లో సమూల మార్పులు చోటుచేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అన్ని పనులను మొబైల్ తోనే చక్కబెట్టేయొచ్చు. దీంతో మొబైల్ వాడకం అనివార్యంగా మారే పరిస్థితులు ఏర్పడొచ్చు. ఫలితంగా ఇప్పటితో పోలిస్తే 2030 నాటికి 700 రెట్లు మొబైల్ అవసరం పెరిగిపోతుందని ఓ అంచనా. టెలికమ్యూనికేషన్ రంగంలో స్పెక్ట్రమ్ అమ్మకం అతిపెద్ద మార్కెట్ గా మారుతుంది. ఇప్పటికే లక్షల కోట్ల మార్కెట్ మరింత పెరిగుతుంది. 5జీని దాటి 6జీ వరకు వెళ్లగలిగితే ఇక ఆ దేశానికి మార్కెట్ పరంగా, టెక్నాలజీ పరంగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే ఇంత పెద్ద మార్కెట్ ను మిగిలిన దేశాల కంటే ముందే తమ స్వాధీనం చేసుకునేందుకు చైనా అప్పుడే 6జీ కోసం ప్రయోగాలు ప్రారంభించింది. 6జీ శాటిలైట్ ను కూడా ఆర్బిట్ లో సక్సెస్ ఫుల్ గా ప్రవేశపెట్టింది కూడా. అయితే..ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టినంత మాత్రం ఇప్పటికిప్పుడు చైనాకు 6జీ సేవలు అందుబాటులోకి రావు. దీనికి ఎంత కాలం పడుతుందో కూడా ఇప్పుడే చెప్పటం కష్టం కూడా. అయితే..చైనా మాత్రం 6జీ ప్రయాణంలో తాము అతి త్వరలోనే లక్ష్యాన్ని చేరుతామని చెబుతోంది. అదే జరిగితే..టెలికమ్యూనికేషన్, డిజిటల్ వరల్డ్ లో ఎన్నో విప్లవాత్మక మార్పులు మన కళ్ల ముందు ఆవిష్కృతం అవుతాయి. మొత్తం సిస్టం అంతా వైర్ లెస్ గా మారిపోతుంది. 5జీ కంటే వెయ్యి రెట్లు ఎక్కువ వేగంగా, సమర్ధవంతంగా 6జీ సేవలను పొందవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. రోబోటిక్ ఆపరేషన్లను ఖచ్చితంగా సునాయసంగా చేయవచ్చు. మానవ మథస్సును ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో క్రోడికరించి..మనిషి ఆలోచనలను కంప్యూటింగ్ వ్యవస్థ అటోమేటిగ్గా రీడ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఫలితంగా మనిషి ఏం చేయాలనుకుంటున్నాడో అతను చెప్పకుండానే కంప్యూటింగ్ వ్యవస్థ చక్కబెడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న 6జీ రేసులో చైనా సక్సెస్ అయితే..టెక్నాలజీ పరంగా చైనా బిగ్ బాస్ అవతారమెత్తటం ఖాయం.
--శ్రావణ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి, హైదరాబాద్)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష