మనిషి కడుపులో 250 ఇనుప మేకులు...సౌదీలో అరుదైన ఆపరేషన్
- November 13, 2020
రియాద్:సౌదీ అరేబియాలో అరుదైన ఆపరేషన్ జరిగింది. ఓ మనిషి కడుపులో నుంచి 250 ఇనుప మేకులు..గాజు ముక్కలను తొలగించారు డాక్టర్లు. సకాలంలో గుర్తించి వాటిని తొలగించటంతో ప్రాణాపాయం తప్పంది. అయితే..బాధితుడికి మానసిక స్థితి సరిగ్గా లేదని..ఈ కారణంగానే అతను ఇనుప మేకులు, గాజు ముక్కలను మింగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇనుప మేకులను మింగటంతో అతనికి పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వచ్చినట్లు..ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి వచ్చినట్లు వైద్యులు వివరించారు. స్కాన్ చేసి పరీక్షించిన వైద్యలు కడుపులో కుప్పలుగా ఉన్న ఇనుప మేకులను చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే ఆపరేషన్ నిర్వహించి మేకులను, గాజు ముక్కలను తొలగించటంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. అయితే..అతని మానసిక స్థితి బాగలేదని, సైక్రియాట్రిక్ ట్రీట్మెంట్ అవసరమని వైద్యులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- నటి శారదకు జేసీ డేనియల్ అవార్డు
- హైదరాబాద్ ECILలో అప్రెంటిస్ కొలువులు
- ‘డే ఆఫ్ సాలిడారిటీ’ సందర్భంగా UAE అంతటా ఎయిర్ షో
- సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ అంటూ మెసేజులు
- తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలు..
- గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపిన జయప్రకాశ్ నారాయణ
- చైనాలో కలకలం సృష్టిస్తున్న ‘నోరా వైరస్’
- అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతం
- DXB టెర్మినల్ 1 కి వెళ్లే బ్రిడ్జి విస్తరణ..!!
- కువైట్ లో జీరో టెంపరేచర్స్ పై హెచ్చరిక..!!







