ఒమనైజేషన్ లక్ష్యసాధన, కార్మిక ప్రయోజనాలే లక్ష్యంగా కార్మిక చట్టాలపై ఒమాన్ సమీక్ష
- November 15, 2020
లేబర్ మార్కెట్లో ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొని..కార్మిక శక్తిని బలోపేతం చేసే దిశగా ఒమాన్ కార్మిక మంత్రిత్వ శాఖ చట్ట సవరణలపై సమీక్ష నిర్వహించింది. ప్రపంచ డిమాండ్ కు తగ్గట్లు ఉత్పత్తి సాధించటం, తద్వారా ప్రపంచదేశాలతో పోటీ పడటంతో పాటు కార్మికుల హక్కులు, ప్రయోజనాలకు మరింత భద్రత కల్పించేందుకు వీలుగా చట్టాలను సరళతరం చేయనుంది. అదే సమయంలో ఒమనైజేషన్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రైవేట్ రంగంలో ఒమనీస్ కి గరిష్ట మొత్తం ఉపాధి కల్పించేందుకు అనువైన పరిస్థితులను నెలకొల్పేలా చట్టాలు, శాసనాధికారాలను సవరణ చేయనున్నట్లు తెలుస్తోంది. 2020-24 మధ్యంతర ఆర్ధిక ప్రణాళికలో భాగంగా గత వారమే ఒమనీయులకు ఉపాధి అవకాశాలను పెంచటం తమ ప్రధాన్యత అంటూ ఒమన్ స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రభుత్వ రంగంలో ఉద్యోగుల హక్కుల తరహాలోనే ప్రైవేట్ రంగంలోనూ కొన్ని వెసులుబాట్లు ఉండేలా ఒమాన్ కార్మిక మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. కోవిడ్ నేపథ్యంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా అకస్మాత్తుగా తొలగించటం లేదా తాత్కాలిక సెలవుల మీద పంపించి వేయటం వంటి చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో కార్మికుల పరిస్థితి దిక్కుతోచకుండా మారింది. ఇక నుంచి ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఏ కారణం చేతనైనా ఉద్యోగం నుంచి తొలగించాల్సి వస్తే కొంతమేర పరిహారం చెల్లించేలా చట్టసవరణ చేసే అంశంపై సమీక్షించింది. ఇక చంటిబిడ్డల తల్లులు, గర్భిణిలకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనంతో కూడిన సెలవులు ఇచ్చేలా కూడా చట్టం తీసుకురాబోతోంది. అయితే..ప్రస్తుతం ఒమాన్ కార్మిక మంత్రిత్వ శాఖ సమీక్షలు...చట్టసవరణలతో ప్రయోజనం పొందేది మాత్రం ఒమాన్ పౌరులే. ఒమనైజేషన్ లక్ష్యాన్ని అందుకోవటం కూడా చట్టసవరణకు ఓ కారణం కానున్న నేపథ్యంలో...ప్రైవేట్ రంగంలో ప్రవాసీయులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోనున్నాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు