నాలుగో సారి బిహార్ సీఎంగా నితీష్‌కుమార్
- November 15, 2020
న్యూఢిల్లీ: బిహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అధిష్టారనే ఉత్కంఠకు తెపడింది. బీహార్ పగ్గాలను జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ నాలుగోసారి చేపట్టనున్నారు. ఈ వీషయాన్ని ఎన్డీయే కూటమి ప్రకటించింది. ఆదివారం నితీష్ కుమార్ ఇంట్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జేడీయూతో పాటు బీజేపీ, హెచ్‌ఎం, వికాశీల్ ఇన్సాన్ పార్టీల ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎన్డీయే కూటమి పక్ష నేత, ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ బెర్త్‌లపై ఈ సమావేశంలో చర్చిస్తారు. సుదీర్ఘం చర్చల అనంతరం శాసనసభాపక్ష నేతగా నితీష్ కుమార్‌ను ఎన్నుకున్నటు ఎన్డీయే ప్రకటించింది.
74 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ.. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కీలక పదవులు ఆశించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కంటే జేడీయూకి తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు నితీష్ కుమార్‌నే తదుపరి ముఖ్యమంత్రిగా ఆమోదించారు. ముఖ్యమంత్రిగా రేపు నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే 125 కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో బీజేపీ 74 స్థానాలు, జేడీయూ 43 స్థానాలు గెలుచుకుంది. ఎన్డీయే కూటమిలో అవామీ మోర్చా, వికాస్ వీల్ హిన్సాన్ చెరో 4 చోట్ల గెలుపొందింది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన