సంజూ భాయ్‌తో కలిసి దీపావళి సంబరాలు...
- November 15, 2020
మున్నాభాయ్ సంజయ్ దత్ కొద్ది రోజుల క్రితం ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడ్డ సంగతి తెలిసిందే. తన పిల్లలైన షహ్రాన్, ఇక్రాల పుట్టినరోజు నాడు క్యాన్సర్‌ని జయించానని పొడవైన పోస్ట్ పెట్టి అభిమానులని ఆనందింపజేశాడు. తమ అభిమాన నటుడు క్యాన్సర్‌ను జయించి తిరిగి మామూలు మనిషిగా మారడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేసారు. ఇక దీపావళి రోజు సంజయ్ దత్ తన భర్య మాన్యతా దత్‌తో కలిసి దుబాయ్ లో దీవాళి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.
సంజయ్ ఇంట్లో జరిగిన దీవాళి వేడుకలలో మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కూడా భాగం అయ్యారు. సంప్రదాయమైన దుస్తులలో మెరిసిన వీరిని చూసి అభిమానులు తెగ సంతోషించారు. వేడుకలకు సంబంధించిన ఫోటోలను మోహన్‌లాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.. 'సంజయ్, మాన్యతా నా స్నేహితులు' అని కాప్షన్ జతచేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తాజా వార్తలు
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు







