వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో కార్తీక శోభ
- November 16, 2020
తెలంగాణ హరిహర క్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసం మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు. కోడెమొక్కులు చెల్లించుకున్నారు. కోవిడ్ నిబంధనల మేరకు గర్భాలయంలో పూజలు రద్దు చేసి లఘు దర్శనం అమలు చేస్తున్నారు. ఆలయంలో నిత్య కళ్యాణం, చండీ హోమం, మహాలింగార్చన, శ్రీసత్యనారాయణ వ్రతాలు వంటి ప్రత్యేక పూజలు మినహా... ఆర్జిత సేవలను రద్దు చేశారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో కొలువైయున్న స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తొలి కార్తీక సోమవారం కావడంతో స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే పెద్ద ఎత్తున భక్తులు చేరుకున్నారు. పంచామృతాలతో శివయ్యకు అభిషేకం నిర్వహించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష