చైర్మన్ పదవికి అగార్కర్ దరఖాస్తు..

- November 16, 2020 , by Maagulf
చైర్మన్ పదవికి అగార్కర్ దరఖాస్తు..

భారత క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీలో మూడు పోస్టులు ఖాళీ అయ్యాయి. ఈ పోస్టుల భర్తీ కోసం ఇటీవల బీసీసీఐ నోటిఫికేషన్‌ ఇచ్చింది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది బీసీసీఐ. సెలక్షన్‌ ప్యానెల్‌లో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు ముగ్గురు మాజీ క్రికెటర్లు అప్లికేషన్‌ పెట్టుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో చేతన్‌ శర్మ, మనీందర్‌సింగ్‌, శివ్‌ సుందర్‌ దాస్‌లు ఉన్నారు. పీటీఐ కథనం ప్రకారం మాజీ ఇండియన్‌ క్రికెటర్‌ అజిత్‌ అగార్కర్‌ కూడా పోటీపడుతున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ ఏడాది జనవరిలోనూ సెలక్టర్‌ పదవి కోసం అగార్కర్‌ దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. జోనల్‌ విధానం కారణంగా అతనికి ఆ పదవి దక్కలేదు. తాజాగా మరోసారి వెస్ట్‌ జోన్‌ తరపున అతను అప్లై చేసుకునే అవకాశాలున్న నేపథ్యంలో.. 231 అంతర్జాతీయ మ్యాచ్‌ల (191 వన్డేలు, 26 టెస్టులు, 4 టీ20) అనుభవం ఉన్న అతనే ఛైర్మన్‌గా ఎంపికయ్యే వీలుంది. ఇందులో చేతన్‌ శర్మ టీమిండియాకు అంతర్జాతీయంగా 23 టెస్టులు, 65 వన్డేల్లో ఆడాడు. మాజీ స్పిన్నర్‌ మనీందర్‌సింగ్‌కు 35 టెస్టులు, 59 వన్డేల్లో ఆడిన అనుభవం ఉంది. మాజీ ఇండియన్‌ ఓపెనర్‌ శివ్‌ సుందర్‌ (  23 టెస్టుల్లో 1326 పరుగులు) ‌ తన అప్లికేషన్‌ పెట్టుకున్నాడు.  జోనల్ విధానాన్ని అవలంబించాలని బీసీసీఐ నిర్ణయించుకుంటే, సునీల్ జోషి స్థానంలో ప్యానెల్ ఛైర్మన్‌గా అగర్కర్ లేదా మనీందర్ ఎంపికయ్యే అవకాశం ఉంది. 

ఆయా పోస్టుల కోసం అప్లికేషన్‌ గడువు ఈనెల 15తో ముగిసింది. ఈ పోస్టులకు అప్లయ్‌ చేసుకొనే వారికి కనీసం 30 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచుల్లో ఆడిన అనుభవం ఉండాలని బీసీసీఐ నిబంధన విధించింది. లేదా ఏడు అంతర్జాతీయ టెస్టులు, 10 వన్డేలు, 20 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి ఉండాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com