17 మిలియన్ రియాల్స్ మోసం కేసులో ఐదుగురి అరెస్ట్
- November 16, 2020
రియాద్:సౌదీ అరేబియా సెక్యూరిటీ అథారిటీస్ ఐదుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 17 మిలియన్ రియాల్స్ కమర్షియల్ స్కాంలో నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. అనుమానితుల్లో ఇద్దరు సిరియా వలసదారులున్నారు. రియాద్ పోలీస్ సహాయ అధికార ప్రతినిది¸ మేజర్ ఖాలిద్ అల్ క్రీడిస్ మాట్లాడుతూ, న్యాయ సంబంధ శాఖల ప్రతినిథులుగా నమ్మించి, ఫారెక్స్ ట్రేడింగ్ కంపెనీల నుంచి డిస్ట్రెస్డ్ డెబిట్స్‌ని నిందితులు రికవర్ చేస్తున్నట్లుగా నటిస్తూ, పలువుర్ని మోసం చేసినట్లు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా నిందితులు పలు ప్రకటనలు ఇచ్చి ఆయా వ్యక్తుల్ని మోసం చేశారు. బ్యాంకు అకౌంట్ వివరాల్ని సేకరించి, డబ్బుల్ని కొట్టేశారు నిందితులు. సుమారు 17 మిలియన్ రియాల్స్ మోసం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష