షిర్డీ సాయి బాబా ఆలయం పునఃప్రారంభం
- November 16, 2020
ముంబై:మహారాష్ట్రలోని ప్రఖ్యాత షిర్డీ సాయిబాబా దేవస్థానంతో పాటు పలు ఆలయాలు సోమవారం తెరుచుకున్నాయి. కొవిడ్ మహమ్మారి మధ్య భక్తులు ఆలయాలను సందర్శించేందుకు ప్రభుత్వం స్టాండర్స్ ఆపరేటింగ్ ప్రోసీజర్స్ జారీ చేసింది. ఆలయాల్లో సామాజిక దూరం, ఫేస్ మాస్క్‌లు ధరించడం తప్పసరి సరి చేశారు. షిర్డీ దేవస్థానం ట్రస్ట్ నిత్యం ఆరువేల మందికిపైగా భక్తులకు మాత్రమే అనుమతి ఇస్తోంది. కౌంటర్లతో పాటు ఆన్‌లైన్‌లో టికెట్లు జారీ చేస్తున్నట్లు షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ తెలిపింది. 65 ఏళ్లు పైబడిన, పదేళ్లలోపు చిన్నారులకు ప్రవేశానికి అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయం, పూణేలోని దాద్‌గుషెత్ హల్వాయి గణపతి ఆలయంలో సైతం భక్తులకు అనుమతి ఇస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చిలో ఆలయాలు మూతపడ్డాయి. కేవలం ఆయా ఆలయాల్లో నిత్య పూజలు జరగ్గా.. భక్తులకు అనుమతి ఇవ్వలేదు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఆలయాల్లో భక్తులకు అనుమతి ఇచ్చారు. జూన్‌లో కేంద్రం ప్రార్థనా స్థలాలను తెరిచేందుకు అనుమతి ఇవ్వగా.. మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో మూసే ఉంచింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష