ఒమన్ వెదర్: రిస్క్ చెయ్యొద్దు
- February 16, 2016
ఒమన్‌లో కురుస్తున్న వర్షాలు, ఆ కారణంగా పొంగిపొర్లుతున్న నీటితో రోడ్లపై ప్రమాదకర పరిస్థితులు పొంచి ఉన్నాయని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) హెచ్చరించింది. రోడ్లపై నీరు ఎక్కువగా ప్రవహిస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని దాటే ప్రయత్నం చేయరాదని సూచించింది. వాతావరణం మేఘావృతమై ఉండడం, వర్షాలు కురుస్తుండడంతో విజిబులిటీ తక్కువ ఉంటుందని పిఎసిడిఎ పేర్కొంది. మస్కట్, ముస్సాందమ్, అల్ బురైమి, అల్ దహిరా, నార్త్ మరియు సౌత్ అల్ బతినాహ్, అల్ దక్లియా, నార్త్ అండ్ సౌత్ అల్ షర్కియా తదితర ప్రాంతాల్లో మంగళవారం నుంచీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. సున్నితమైన ప్రాంతాల్లో సిఎసిడిఎ రెస్క్యూ బృందాల్ని ఏర్పాటు చేసింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని హెచ్చరికలు జారీ చేశారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









