ప్రచ్ఛన్నయుద్ధ ఛాయలతో భారతీయులు గజగజ
- February 16, 2016
రష్యా అనుకూల ఇరాన్.. అమెరికా సమర్థించే సౌదీ అరేబియా దేశాలు సిరియా యుద్ధభూమిలో ముఖాముఖి తలపడేందుకు సిద్ధమవుతుండటంతో గల్ఫ్ దేశాలలో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. సౌదీ అరేబియా నేతృత్వంలో ‘ఆపరేషన్ నార్తర్న్ థండర్ ’ (షుమాల్ రాయిద్) పేరిట గల్ఫ్ దేశాలు సైనిక చర్యకు ఉపక్రమించాయి. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైత ఇతర గల్ఫ్ దేశాల సైన్యాలన్ని సిరియా వైపు సరిహద్దు దాటడానికి సౌదీ అరేబియాలోని ఉత్తరాది ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. అమెరికా సాయంతో సైనిక దళాలు ఒక్కసారిగా సిరియా వైపు ప్రవేశించడం మొదలు పెడితే సిరియా ప్రభుత్వ బలగాలకు సహాయం అందిస్తున్న రష్యా వైమానిక దళాలు స్పందించే తీరుపై ఉత్కంఠ నెలకొంది. సిరియా అధ్యక్షుడు బషర్ అసద్‌ను గద్దె దింపడ మే లక్ష్యంగా సౌదీ అరేబియా గత ఐదేళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. సిరియాకు ఒక్కసారిగా రష్యా నుంచి వైమానిక బలగాల సహాయం అందడంతో నేరుగా సిరియా సరిహద్దు లోపలకు ప్రవేశించి అధ్యక్షుడు బషర్ అసద్‌ను బలవంతంగా గద్దె దింపుతామని సౌదీ హెచ్చరించింది. ఇక గల్ఫ్ దేశాలతో పాటుగా 20 సున్ని దేశాల సేనలు ఆపరేషన్ నార్తర్న్ థండర్ పాల్గొంటాయని సౌదీ అరేబియా సోమవారం సాయంత్రం ప్రకటించగా, ఈ ఆపరేషన్‌లో పాల్గొనేందుకు తమ బలగాలు బయలుదేరాయని మంగళవారం యూఏఈ ప్రకటించింది. సిరియా భూభాగంతో 880 కిలోమీటర్ల సరిహద్దు కల్గిన టర్కీ.. సౌదీ అరేబియాకు సైనిక మద్దతనిస్తోంది. అలాగే, ఇరాక్ మీదుగా సిరియాలోకి వెళ్లడానికి సౌదీలోని హాఫర్ అల్ బాతీన్ సైనిక స్థావరంలో పూర్తిస్థాయి సన్నాహాలు జరుగుతున్నాయి. సౌదీ అరేబియాకు అమెరికా మద్దతునిస్తుండగా సిరియాకు రష్యా మద్దతునిస్తోంది. కానీ యుద్ధ భూమికి చేరుకున్న తర్వాత ఈ సైన్యాల పరిస్ధితి ఏమిటనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. సోవియట్ యూనియన్ ప్రచ్ఛన్న యుద్ధం పరిస్ధితి మళ్ళి పునరావృతం అవుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, టర్కీ, ఇరాక్ సరిహద్దులలో సిరియా ప్రభుత్వ ఉనికే లేదు. అక్కడ ఒకవైపు తిరుగుబాటుదారులు మరోవైపు ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులే రాజ్యమేలుతున్నారు. సౌదీ అరేబియా సరిహద్దు నగరాలైన హాఫర్ అల్ బాతీన్, ఆరార్ల వైపు నుంచి గల్ఫ్ దేశాల సైన్యాలు సిరియా వైపు వెళ్లాల్సి ఉండగా ఈ రెండు ప్రాంతాలలో భారీ సంఖ్యలో ఉన్న తెలుగు వారితో పాటు ప్రవాస భారతీయులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే యెమెన్‌లో యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలు భారీ ఖర్చును భరిస్తున్నాయి దీనికి తోడుగా పడిపోతున్న చమురు ధరలతో ఆర్ధిక పరిస్థితి సంకటంగా మారుతోంది. తాజాగా సిరియాతో యుద్ధం వలన ఆర్థిక పరిస్థితి మరింత జఠిలమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
--యం.వాసు దేవా రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







