మొక్కజొన్న పాయసం
- February 17, 2016
కావలసిన పదార్థాలు: ఉడికించిన మొక్కజొన్న గింజలు - అరకప్పు పనీర్ (చిన్నముక్కలు) - అరకప్పు పాలు - అరలీటరు, పాలపొడి - 6 టేబుల్ స్పూన్లు, పిస్తా
పలుకులు-8, బాదం పలుకులు -10, రోజ్‌వాటర్ - టీ స్పూను, యాలకుల పొడి - అరస్పూను, పంచదార - టేబుల్‌స్పూను, కుంకుమపువ్వు - కొద్దిగా.
తయారుచేసే విధానం
ముందుగా కుంకుమపూవుని రోజ్‌వాటర్‌లో, పిస్తా, బాదం పప్పుల్ని వేడి నీటిలో కొద్దిసేపు నానబెట్టి ఉంచాలి. పిస్తా బాదంలను నీటిలోంచి తీసి సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఒక పాత్రలో పాలను కాగబెట్టి, అందులో మొక్కజొన్న గింజల్ని, పనీరు ముక్కల్ని వేసి, చిన్న మంటపై 5 నిమిషాల పాటు ఉడికించి ఆపై పాలపొడిని వేస్తూ ఉండలు చుట్టకుండా కలపాలి. పాలు చిక్కబడ్డాక పంచదారను వేసి, అది కరుగుతున్నపడు కుంకుమపూవును కూడా వేసి దించాలి. తరిగి ఉంచుకున్న బాదం, పిస్తా ముక్కల్ని, యాలకుల పొడిని పైన చల్లాలి. పాయసం గది ఉష్ణోగ్రతలోకి వచ్చేక ఫ్రిజ్‌లో ఉంచి చల్లచల్లగా తాగితే చాలా రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







