ఉద్యోగాల కోసం 15 రోజుల్లో 6,250 మంది కువైటీల నమోదు
- November 16, 2020
కువైట్ సిటీ: సివిల్ సర్వీస్ కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం మినిస్ట్రీస్ అలాగే ప్రభుత్వ ఏజెన్సీల్లో ఉద్యోగాల కోసం 6,250 మంది కువైటీలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 30 వరకు నమోదైన గణాంకాలు ఇవి. ఈ నెలాఖరులో, నమోదు కాబడిన వివరాల్ని సిఎస్‌సి సమీక్షించనున్నట్లు సంభందిత వర్గాలు పేర్కొన్నాయి. కువైటీ యువత ఉద్యోగాలు దొరక్క గత కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది అంచనాల ప్రకారం 16 శాతానికి నిరుద్యోగం చేరుకుంది. కాగా, సివిల్ సర్వీస్ కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం పబ్లిక్ సెక్టార్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 79 శాతం కువైటీలే. 2017 నుంచి కువైట్‌లో కువైటేజేషన్ జరుగుతోంది. ఆయా ఉద్యోగాల్లో పనిచేస్తున్న వలసదారుల్ని కువైటీలతో భర్తీ చేయడమే కువైటైజేషన్. 2021 నాటికి 100 శాతం కువైటైజేషన్ పూర్తి చేసేలా ప్రణాళికలు రచించి, అమలు చేస్తున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







