సంచయితపై ఘాటు వ్యాఖ్యలు చేసిన అశోక్ గజపతిరాజు..
- November 17, 2020
గజపతిరాజుల కుటుంబ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. మాన్నాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ బాధ్యతలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని 104 ఆలయాల బాధ్యతను కూడా ఏపీ ప్రభుత్వం సంచయితకు అప్పగించడంపై అశోక్ గజపతిరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో సంచయిత చేసిన పోస్టుపై ఆయన ధ్వజమెత్తారు.
‘చరిత్రలో తండ్రులు మార్చేవారు ఎవరైనా ఉన్నారా? అంటూ సంచయితను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో మీ తండ్రి ఎవరో మీరే పోస్ట్ చేశారు. మీరు చేస్తున్న పోస్టులు.. మీ వ్యవహారశైలికి అడ్డం పడుతున్నాయి. ఎవరో పెట్టిన పోస్టులకు తాను సమాధానం చెప్పాల్సి రావడం తన ఖర్మ’ అని అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు.
మాన్నాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి ఆనవాయితీగా వచ్చేది. అలాకాదని కోర్టు తీర్పులకు, ఆనవాయితీలకు విరుధ్ధంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. ఇష్టమొచ్చిన వారిని కుటుంబసభ్యులని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. తండ్రి, తాతను కూడా ఎప్పడూ సంచయిత కలవలేదని అశోక్ గజపతి రాజు దుయ్యబట్టారు.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్‌వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







