వచ్చే ఏడాది మొదట్లో బహ్రెయిన్‌కి కోవిడ్‌ వ్యాక్సిన్‌

- November 17, 2020 , by Maagulf
వచ్చే ఏడాది మొదట్లో బహ్రెయిన్‌కి కోవిడ్‌ వ్యాక్సిన్‌

బహ్రెయిన్: హెల్త్‌ సుప్రీం కౌన్సిల్‌ హెడ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ డాక్టర్‌ మొహమ్మద్‌ బిన్‌ అబ్దుల్లా అల్‌ ఖలీఫా వెల్లడించిన వివరాల ప్రకారం కరోనా వైరస్‌ మొదటి బ్యాచ్‌లు, బహ్రెయిన్‌కి వచ్చే ఏడాది మొదట్లో వస్తాయని చెప్పారు. ప్రతినిథుల సభకు పంపబడిన నివేదిక ప్రకారం ఈ విషయం స్పష్టమవుతోంది. ఆ నివేదిక ప్రకారం చూస్తే, కరోనా వ్యాక్సిన్‌ వచ్చేవరకు.. అంటే, 2021 ప్రారంభం వరకు ప్రతినిథుల సభకు సంబంధించిన సెషన్స్‌ రిమోట్‌ పద్ధతిలో నిర్వహించాల్సి వుంటుంది ఆ నివేదిక పేర్కొంటోంది. అక్టోబర్‌ 26న చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ నిర్ణయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com