నేషనల్ డే, క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై కోవిడ్ ఎఫెక్ట్..ఆంక్షలు విధించిన యూఏఈ
- November 18, 2020
యూఏఈ: కోవిడ్ సెకండ్ వేవ్ ముప్పు బయపెడుతున్న ప్రస్తుత పరిస్థితులు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని యూఏఈ ప్రభుత్వం సూచించింది. రాబోయే రోజుల్లో యూఏఈ నేషనల్ డేతో పాటు క్రిస్మస్, న్యూ ఇయర్ వంటి బిగ్ ఈవెంట్ డేస్ వస్తున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది ప్రభుత్వం. నేషనల్ డే, క్రిస్మస్, న్యూ ఇయర్ రోజుల్లో ప్రజలు ఎవరూ బయట గుమికూడొద్దని, గతంలో మాదిరిగా వీధుల్లో కలియతిరుగుతూ సందడి చేసేందుకు ఈ సారి అనుమతించబోమని స్పష్టం చేసింది. ప్రజలు ఒక చోట చేసి సంబరాలు చేసుకోవటం..బహుమతులు పంచుకోవటం మానుకోవాలని తెలిపింది. వీలైనంత వరకు వర్చువల్ గానే శుభాకాంక్షలు తెలుపుకోవాలని సూచించింది. బహిరంగ ప్రాంతాలకు రావాల్సి వస్తే ఖచ్చితంగా ఫేస్ మాస్క్ ధరించటంతో పాటు రెండు మీటర్ల ఎడం పాటించాలని తెలిపింది. ఇక మూడు నాలుగు గంటలకు మించి జరిగే ఈవెంట్లకు ఖచ్చితంగా సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని, ఈవెంట్ల నిర్వహణలో కోవిడ్ నిబంధనలను అన్నింటిని ఖచ్చితంగా పాటించి తీరాలని ప్రభుత్వం ఆదేశించింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు