ప్రేమను చాటిన 'దుబాయ్ పోలీసులు'..ఒక్క రోజు పోలీసుగా 9 ఏళ్ల బాలుడు

- November 19, 2020 , by Maagulf
ప్రేమను చాటిన \'దుబాయ్ పోలీసులు\'..ఒక్క రోజు పోలీసుగా 9 ఏళ్ల బాలుడు

దుబాయ్: దుబాయ్ అనగానే గుర్తొచ్చేది విలాసవంతమైన జీవనశైలి..ఇక దుబాయ్ పోలీసు విషయానికొస్తే, వీళ్ళు ఉపయోగించే కార్లు అందరిని 'ఔరా' అనిపించకమానవు. అధునాతన వాహనాలు, వేగంగా దూసుకుపోయే లగ్జరీ కార్లకు పెట్టిందిపేరు దుబాయ్. ఈ కార్లకు ఫిదా అవ్వని పిల్లలుంటారా చెప్పండి! పిల్లలేంటి, అవకాశం దొరికితే పెద్దలు సైతం ఈ కార్లలో ఒక రౌండ్ కొట్టేయాలి అనుకుంటారు. ఈ కార్లెక్కి తిరగాలి అని కోరిక వెలిబుచ్చిన చిన్నారికి తన కల నిజం చేశారు దుబాయ్ పోలీసులు..వివరాల్లోకెళితే..

దివ్యంగుడైన తొమ్మిదేళ్ల ఎమిరాతీ బాలుడు సౌద్ ముహమ్మద్ అల్ అవదీ ఒక రోజు పోలీసుగా ఉండి దుబాయ్ పోలీస్ సూపర్ కార్ రైడ్ చేయాలన్న తన కోరికను తల్లిదండ్రులకు తెలియజేశాడు. సౌద్ తల్లి దుబాయ్ పోలీస్ స్మార్ట్ యాప్ ద్వారా తన కొడుకు కోరిక గురించి సందేశం పంపినప్పుడు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ హ్యాపీనెస్ అధికారులు వెంటనే ఆ బాలుని కోరికను మంజూరు చేయటం జరిగింది.

పోలీసు బృందం సౌద్‌ను సందర్శించింది, అతనికి పూర్తి పోలీసు యూనిఫాంను ధరింపచేసి ఎమిరేట్స్ లా మెర్ ప్రాంతమంతా లగ్జరీ పోలీసు పెట్రోలింగ్‌లో తిప్పారు.

తన కొడుకు సంతోషాన్ని చూసి భావోద్వాగానికి లోనైన తల్లి మాట్లాడుతూ "సౌద్ కు దుబాయ్ పోలీసులు అంటే ఎంతో అభిమానం. ఒక్క రోజు దుబాయ్ పోలీసుగా ఉండాలన్న మా అభ్యర్థనకు  వెంటనే స్పందించి తమ విలువైన సమయాన్ని మాకు కేటాయించనందుకు మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ చర్య అతను ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకం" అని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com