నెదర్లాండ్స్ పై భారత్ విజయం
- February 19, 2026
అహ్మదాబాద్: టీ20 ప్రపంచ కప్ లో భారత్ విజయాల పరంపర కొనసాగుతోంది. ఈ టోర్నీలో భారత్ మరో గెలుపు సాధించింది. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా విక్టరీ కొట్టింది. 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. 194 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ ను 176/7 రన్స్ కే పరిమితం చేసింది భారత్.
దీంతో 17 రన్స్ తేడాతో టీమిండియా గెలుపొందింది. కాగా 19 ఓవర్ లో 18 పరుగులు రావడంతో ఉత్కంఠకు దారితీసింది. అయితే, చివరి ఓవర్ దూబే కట్టుదిట్టంగా వేయడంతో భారత్ గెలిచింది. టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లతో చెలరేగాడు. దూబే రెండు వికెట్లు తీశాడు. బుమ్రా, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు. ఈ నెల 28వ తేదీ నుంచి సూపర్-8 పోరు ప్రారంభం కానుంది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. డకౌట్ అయ్యాడు. శివం దూబే హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 31 బంతుల్లోనే 66 పరుగులు బాదాడు. 6 సిక్సులు, 4 ఫోర్లు కొట్టాడు. హార్దిక్ పాండ్యా ధనాధన్ బ్యాటింగ్ ఆడాడు. 21 బంతుల్లోనే 30 రన్స్ చేశాడు. 3 సిక్సులు కొట్టాడు. ఇషాన్ కిషన్ 18 పరుగులు, తిలక్ వర్మ 31, సూర్యకుమార్ యాదవ్ 34, రింకు సింగ్ 6 (నాటౌట్) పరుగులు చేశారు.
కాగా, టీమిండియా డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి ఫెయిల్ అయ్యాడు. నెదర్లాండ్స్‌పై పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగారు. ఇన్నింగ్స్ మూడో బంతికే ఆర్యన్ దత్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఈ వరల్డ్ కప్ లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు.
తాజా వార్తలు
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!







