అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!
- February 18, 2026
యూఏఈ: యూఏఈలో సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై స్కూల్స్ హెచ్చరికను జారీ చేస్తున్నాయి. ఇటీవల దుబాయ్‌లోని ఒక పాఠశాల ఆన్‌లైన్‌లో అనుచిత కంటెంట్ కనిపించిన తర్వాత ఈ మేరకు తాజా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇలాంటి ధోరణులు తీవ్ర ఆందోళన కలిగించే విషయంగా పేర్కొంటూ స్కూల్స్ మేనేజ్ మెంట్లు తల్లిదండ్రులకు ఒక సర్క్యులర్ పంపుతున్నాయి.
తరచూ మిడిల్ స్కూల్ విద్యార్థులు ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్‌లు, రీల్స్, ప్రైవేట్ మెసేజులను కూడా పంచుకుంటున్నారు. పాఠశాల లోగో, పేరు లేదా సిబ్బంది గుర్తింపులతో సహా కంటెంట్ అనుచితమైన వ్యాఖ్యలతో ఉంటుందని, ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదని స్కూల్స్ చెబుతున్నాయి.
స్కూల్స్ తరచుగా క్యాంపస్ నెట్‌వర్క్‌లలో కొన్ని ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేస్తున్నప్పటికీ, కొంతమంది విద్యార్థులు కొత్త మార్గాలను కనుగొంటున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. విద్యార్థులు VPNలు, వ్యక్తిగత డేటా సిమ్ కార్డులు లేదా మొబైల్ ఫోన్‌లను ఉపయోగించే సందర్భాలు కూడా ఉన్నాయని, ఇవి సైబర్ భద్రతాపరమైన చట్టాల ప్రకారం ఉద్దేశపూర్వక ఉల్లంఘన కిందకు వస్తుందని హెచ్చరించాయి.
దుబాయ్‌లోని స్విస్ ఇంటర్నేషనల్ సైంటిఫిక్ స్కూల్‌లోని సెకండరీ హెడ్ బ్రియాన్ క్లియరీ మాట్లాడుతూ.. ఇటువంటి సంఘటనలు ఎక్కువ హాని కలిగిస్తాయని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, తల్లిదండ్రులు లేదా సిబ్బంది గౌరవాన్ని ఇబ్బందుల్లో పడవేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
నేటి విద్యార్థులు అధిక డిజిటల్ లిటరసీని కలిగి ఉన్నారని, కానీ టెక్నికల్ నాలేజ్డ్ మాత్రమే సమస్యను పరిష్కరించలేదని క్లియరీ స్పష్టం చేశారు.తమ స్కూళ్లో డిజిటల్ వాల్యూస్, వీపీఎన్ వినియోగంతో జరిగే నష్టాలు తదితర అంశాలను అందరికి కనిపించేలా ఏర్పాటు చేశామని, తద్వారా విద్యార్థుల్లో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.
అదే సమయంలో దుబాయ్ పోలీసుల సాయంతో సైబర్ సెక్యూరిటీ, సోషల్ మీడియా దుర్వినియోగంపై ప్రత్యేక సెషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పలు స్కూల్స్ మేనేజ్ మెంట్లు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







