న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్న దుబాయ్
- November 20, 2020
దుబాయ్ ఐకాన్ బుర్జ్ ఖలిఫా కొత్త సంవత్సరం వేడుకలకు సిద్ధమవుతోంది. భారీగా ఫైర్ వర్క్స్, లేజర్ షోలు, లైటింగ్ తో కళ్లు మిరుమిట్లు గొలిపేలా న్యూ ఇయర్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తామని చెబుతోంది రియల్ ఏస్టేట్ దిగ్గజ సంస్థ ఎమార్. ప్రతీ వేడుకను జనం గుర్తుంచుకునేలా వరల్డ్ క్లాస్ ఎక్స్ పీరియన్స్ తో నిర్వహించటం తమ సంస్థ డీఎన్ఏలోనే ఉందని వెల్లడించిన ఎమార్ వ్యవస్థాకులు మొహమ్మద్ అలబ్బేర్...2021 న్యూ ఇయర్ ను కూడా అదే రేంజ్ లో సెలబ్రేట్ చేస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, అయితే..ఈ సంక్లిష్ట పరిస్థితుల్లోనూ తాము ఒక్కటిగా ఉండి సవాళ్లను ఎదుర్కొనేందుకు సమర్ధవంతంగా ఉన్నామని, వచ్చే ఏడాదిని మరింత పట్టుదలతో, కసితో గతంలో కంటే ఎక్కువ అభివృద్ధి సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం
చేశారు. అయితే..కొత్త సంవత్సరం వేడుకలను ఘనంగా ఏర్పాట్లు చేస్తూనే...కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన మార్గనిర్దేశకాలను కూడా పాటిస్తామని తెలిపారు. వేడుకలకు హజరయ్యే ప్రతి వ్యక్తి ఆరోగ్య సంరక్షణ తమకు ముఖ్యమని, అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ధర్మల్ కెమెరాలను ఏర్పాటు చేయటంతో పాటు, భౌతిక దూరం పాటించటం, డిజిటల్ పే మేంట్స్, ఎప్పటికప్పుడు పరిసరాలను డిసిన్ఫెక్షన్ చేయటం వంటి చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇదిలాఉంటే...బుర్జ్ ఖలిఫా దగ్గర జరిగే కొత్త సంవత్సరం వేడుకలను ప్రపంచమంతా mydubainewyear.com ద్వారా ప్రత్యక్షప్రసారం చేస్తామని వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!
- హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..
- వీసా ఫీజులను పెంచిన జపాన్ ..భారతీయుల పై పడనున్న భారం!
- వాట్సాప్ కొత్త సెక్యూరిటీ ఫీచర్
- APL తొలి మ్యాచ్ కు ముఖ్య అతిథిగా రానున్న రామ్ చరణ్
- ట్రంప్ అధికారాలకు బ్రేక్: ఇరాన్‌తో యుద్ధాన్ని నిరోధిస్తూ చారిత్రాత్మక తీర్మానం
- చిన్నారి పై హత్యాచారం.. కాలు పై కాల్చి మృగాడిని పట్టుకున్న పోలీసులు
- నార్త్ అల్ బతినాలో 'మ్యాంగో ఎక్స్‌ట్రావాగంజా' ప్రారంభం..!!







