700 మందికి పైగా వాహనదారుల బ్లాక్ పాయింట్స్ రద్దు, తిరిగి లైసెన్సులు
- November 20, 2020
అబుధాబి:మొత్తంగా 764 మంది డ్రైవర్లకు సంబంధించిన లైసెన్సులు గడచిన తొమ్మిది నెలల్లో పునరుద్ధరింపబడ్డాయి. వీరి ఖాతాల్లోంచి బ్లాక్ పాయింట్స్ రద్దు చేయబడ్డాయి. అబుదాబీ పోలీస్ - పోలీస్ మానిటరింగ్ అండ్ కమ్యూనిటీ సెక్యూరిటీ కేర్ - డైరెక్టర్ కల్నల్ డాక్టర్ మొహమ్మద్ అహ్మద్ అల్ బురైకి వెల్లడించిన వివరాల ప్రకారం, డ్రైవర్ల భద్రత పట్ల అంకిత భావంతో పనిచేస్తున్నామనీ, ఈ క్రమంలో వాహనదారులకు భద్రతతో కూడిన డ్రైవింగ్ పట్ల అవగాహన కల్పిస్తున్నామనీ, సరికొత్త కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. 23 కంటే తక్కువ బ్లాక్ పాయింట్స్ కలిగిన డ్రవర్లు, ఏడాదిలో ఓసారి ట్రెయినింగ్ ప్రోగ్రాంకి హాజరవ్వాల్సి వుంటుంది. ఈ ప్రోగ్రాంలో రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తారు. వీరి నుంచి 8 ట్రాఫిక్ పాయింట్స్ని తగ్గించడం జరుగుతుంది. కాగా, 24 ట్రాఫిక్ పాయింట్స్ కలిగిన డ్రైవర్లు, తమ లైసెన్సుని మూడు నెలల పాటు తాత్కాలికంగా కోల్పోవాల్సి వస్తుంది. అయితే, ట్రెయినింగ్ కోర్సులో పాస్ అయితే, వీరికి ఉపశమనం కల్పిస్తుంది. ఆయా డ్రైవర్లకు వారి మాతృ భాషల్లో ఈ ట్రెయినింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు