ఇంటిని కేఫ్‌గా మార్చి, షిషా అందిస్తోన్న వ్యక్తికి రిమాండ్‌

- November 20, 2020 , by Maagulf
ఇంటిని కేఫ్‌గా మార్చి, షిషా అందిస్తోన్న వ్యక్తికి రిమాండ్‌

మనామా:తన ఇంటికి సంబంధించిన కోర్టుయార్డ్‌ని కాఫీ షాపుగా మార్చి, షిషా అందిస్తోన్న ఓ వ్యక్తికి న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. అతనిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో 13 మంది వినియోగదారులని కూడా అరెస్ట్‌ చేయడం జరిగింది. మాస్క్‌లు లేకుండా ఆ కేఫ్‌లోకి అడుగు పెట్టినట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. కాగా, కేఫ్‌లో ఎలాంటి కరోనా నిబంధనలూ పాటించకుండా డ్రింక్స్‌ని కూడా సరఫరా చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా వుంటే, బహ్రెయిన్‌లో ఇప్పటిదాకా 85,317 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 337 మంది ప్రాణాలు కోల్పోయారు కరోనా కారణంగా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com