డ్రగ్‌ ట్రాఫికింగ్‌: బహ్రెయినీ మహిళకు ఐదేళ్ళ జైలు శిక్ష

- November 21, 2020 , by Maagulf
డ్రగ్‌ ట్రాఫికింగ్‌: బహ్రెయినీ మహిళకు ఐదేళ్ళ జైలు శిక్ష

మనామా:బహ్రెయినీ న్యాయస్థానం, ఓ బహ్రెయినీ మహిళకు ఐదేళ్ళ జైలు శిక్ష ఖరారు చేసింది. ఆమెకు 3,000 బహ్రెయినీ దినార్స్‌ జరీమానా కూడా విధించడం జరిగింది. కేసు వివరాల్లోకి వెళితే, మహిళపై డ్రగ్స్‌ అభియోగాలు మోపబడ్డాయి. పోలీసులు జరిపిన సోదాల్లో నిందితురాలి ఇంటి నుంచి 100 గ్రాముల సైకోట్రోఫిక్‌ సబ్‌స్టాన్సెస్‌ని స్వాధీనం చేసుకున్నారు. పెథాంఫెటమైన్‌ అలాగే డయాజెపాంలను నిందితురాలు తన దగ్గర వుంచుకోవడంతోపాటు, వాటిని వాడుతున్నట్లు కూడా గుర్తించారు అధికారులు. యాంటీ నార్కోటిక్స్‌ డిపార్ట్‌మెంట్‌, పక్కా సమాచారంతో నిందితురాల్ని అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. మహిళా అధికారులు, నిందితురాల్ని అరెస్ట్‌ చేయడంలో కీలక పాత్ర పోషించారు. క్రిస్టల్‌ సబ్‌స్టాన్స్‌ వున్న ఓ బ్యాగుని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com