క్రీడల్లో మహిళా భాగస్వామ్యం 70 శాతం పెరుగుదల
- November 21, 2020
రియాద్:సౌదీ అరేబియాలో మహిళలు క్రీడల్లో రాణిస్తున్నారనీ, ఇటీవలి కాలంలో వారి భాగం గణనీయంగా పెరిగిందనీ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ టుర్కి చెప్పారు. సౌదీ అరేబియా, మహిళల్ని క్రీడా రంగంలో ప్రోత్సహిస్తోందనీ, ఈ కారణంగా వారి భాగస్వామ్యం 70 శాతం వరకు పెరిగిందని చెప్పారు ప్రిన్స్ అబ్దుల్ అజీజ్. మహిళల ఫుట్‌బాల్ లీగ్‌పై మాట్లాడిన ప్రిన్స్ అబ్దుల్ అజీజ్, ఈ పోటీల పట్ల చాలా ఉత్సాహంగా వున్నామని అన్నారు. ఈ విభాగంలో తాము ముందంజలో వున్నట్లు చెప్పారు. చిన్న మధ్య తరహా సంస్థలు స్పోర్ట్స్ క్లబ్‌లను ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ దిశగా తాము ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు వివరించారు. రానున్న రోజుల్లో ఈ విభాగంలో మరిన్ని విజయాలు సాధిస్తామని అన్నారాయన.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు