జర్నలిస్టుని ప్రశంసించిన షేక్‌ మొహమ్మద్‌

- November 21, 2020 , by Maagulf
జర్నలిస్టుని ప్రశంసించిన షేక్‌ మొహమ్మద్‌

యూఏఈ:ఎమిరేట్‌లో గాయపడ్డ ఓ పక్షిని రక్షించే విషయమై జర్నలిస్ట్‌ చూపిన చొరవను యూఏఈ వైస్‌ ప్రెసిడెంట్‌, ప్రైమ్ మినిస్టర్‌, దుబాయ్‌ రూలర్‌ అయిన షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్ కొనియాడారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు షేక్‌ మొహమ్మద్‌. అరబిక్‌ మీడియా జర్నలిస్ట్‌ రోలా అల్‌ఖాతిబ్‌, సోషల్‌ మీడియా వేదికగా ఓ ట్వీట్‌ వేయడం జరిగింది. బీచ్‌లో వెళుతుండగా తాను ఓ పక్షిని చూశాననీ, అది గాయపడి వుందనీ, వెంటనే తాను దుబాయ్‌ మునిసిపాలిటీకి సమాచారం అందించాననీ, వెంటనే వారు స్పందించి, దానికి వైద్య చికిత్స అందించారని జర్నలిస్ట్‌ పేర్కొన్నారు తన ట్వీట్‌లో. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com