ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోరుకుంటేనే కోవిడ్ వ్యాక్సిన్...స్పష్టతనిచ్చిన కువైట్

- November 21, 2020 , by Maagulf
ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోరుకుంటేనే కోవిడ్ వ్యాక్సిన్...స్పష్టతనిచ్చిన కువైట్

కువైట్: కోవిడ్ వ్యాక్సిన్ డోసుల విషయంలో ఎవరిని బలవంత పెట్టేది లేదని కువైట్ ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యాక్సిన్ కు పూర్తి అనుమతులు వచ్చి, కువైట్ కు దిగుమతి అయిన తర్వాత వ్యాక్సిన్ కావాలని అనుకునే వారికి మాత్రమే డోసులు ఇస్తామని తెలిపింది. అయితే..దీనిపై పూర్తి నిర్ణయాధికారం హెల్త్ మినిస్ట్రికి ఉండనుంది. ఒకవేళ ఫలానా వర్గానికి అనివార్యం అని భావిస్తే మినహా ఏ రంగంలోని వ్యక్తులనైనా వ్యాక్సిన్ ఖచ్చితంగా వేయించుకోవాలనే నిబంధనలు ఉండబోమని తెలిపింది. కోవిడ్ రిస్క్ ఎక్కువగా వైద్య సిబ్బంది కూడా తమకు ఇష్టమైతేనే వ్యాక్సిన్ తీసుకోవచ్చని తెలిపింది. వ్యాక్సిన్ విషయంలో ఫైజర్ తో ఒప్పందం కుదుర్చుకున్న కువైట్ పది లక్షల డోసులకుగాను ఇప్పటికే ఒప్పందం చేసుకున్న విషయం తెలిసింది. అయితే..తుది అనుమతులు రాగానే వ్యాక్సిన్ డోసులు దిగుమతి కానున్నాయి. దేశంలో కోవిడ్ రిస్క్ ఎక్కువగా రంగాల ప్రాతిపదికన వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ చేపట్టేందుకు ఇప్పటికే కార్యచరణ సిద్ధం చేసే పనిలో ఉంది కువైట్ యంత్రాగం. ఫ్రంట్ లైన్ వర్కర్లతో పాటు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందిపడుతున్నవారికి, తప్పనిసరిగా వ్యాక్సిన్ అవసరమైన వ్యక్తులకు అధిక ప్రాధన్యత క్రమంలో వ్యాక్సిన్ డోసులు ఇచ్చేలా కసరత్తు చేస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com