చివరి దశకు చేరుకున్న కింగ్ హమెద్ రహదారి పనులు
- November 21, 2020
బహ్రెయిన్: 9.3 మిలియన్ల దినార్లతో చేపట్టిన కింగ్ హమెద్ రహదారి పనులు ఇక చివరి దశకు చేరుకున్నట్లు పట్టణ ప్రణాళిక, మున్సిపల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రహదారి పనులు శరవేగంగా జరుగున్నట్లు వివరించారు. రహదారి అభివృద్ధి పనుల్లో భాగంగా ఇప్పటికే రెయిన్ వాటర్ డ్రైనేజ్, రహదారి పక్కన ఓపెన్ కెనాల్, పేవింగ్ రోడ్స్, లైటింగ్ పోల్స్, ట్రాఫిల్ లైట్స్, రహదారికి ఇరువైపుల సెఫ్టీ బ్యారియర్ల నిర్మాణం పనులు చేపట్టినట్లు వివరించింది. ఇక ఇప్పుడు రోడ్డుపై తారు పనులు, పేవింగ్ వర్క్స్ పూర్తి కావాల్సి ఉందని వెల్లడించింది. మొత్తం మూడు లేన్లుగా రహదారిని విస్తరిణ పనులు జరుగుతున్నాయని, 96వ స్ట్రీట్ దగ్గర కూడలిని అభివృద్ది చేస్తున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. రహదారి పనులను మరింత శరవేగంగా పూర్తి చేసేందుకు ట్రాఫిక్ తక్కువగా ఉండే వీకెండ్స్ లో పనులు జరిగే చోట ఆంక్షలను అమలు చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు