రక్తదానం చేసే వారు సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ ను సంప్రదించాలని డీబీబీఎస్ వినతి
- November 22, 2020
మస్కట్: రక్తదానం చేసే వాళ్లు బౌషర్ లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ ను సంప్రదించాలని బ్లడ్ బ్యాంక్స్ సర్వీస్ డిపార్ట్మెంట్-డీబీబీఎస్ సూచించింది. ఈ వారం రోజుల్లో తాము బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలను నిర్వహించలేమని డీబీబీఎస్ స్పష్టం చేసింది. అయితే..రక్తదానం చేయాలనుకునే వారు డీబీబీఎస్ కు ప్రత్యామ్నాయంగా బౌషర్ లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ కేంద్రాలను సంప్రదించాలని డీబీబీఎస్ సూచించింది. తమకు 100 నుంచి 120 వరకు బ్లడ్ యూనిట్స్ అవసరం అవుతానయని కూడా వివరించింది. రక్తదానం చేయాలని అనుకునే వాళ్లు 94555648 నెంబర్ కు తమ వివరాలను వాట్సాప్ చేయాలని కోరింది. వాట్సాప్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న రక్తదాతలు తమ పూర్తి పేరు, రక్తదానం చేసే రోజు, సమయం వంటి వివరాలతో పాటు సివిల్ ఐడీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే దాతలు ప్లాస్మా దాతలా, ప్లేలెట్స్ దాతలా, రక్తదాతలా అనే వివిరాలు కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్‌ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









