బహ్రెయిన్,యూఏఈ, సీషెల్స్ దేశాల్లో పర్యటించనున్న భారత విదేశాంగ మంత్రి
- November 24, 2020
మనామా:గల్ఫ్ కంట్రీస్ తో పాటు సీషెల్ లో ఆరు రోజుల పర్యటన నిమిత్తం భారత విదేశాంగ మంత్రి జయశంకర్ రేపు బహ్రెయిన్ చేరుకోనున్నారు. ఆయన తొలుత బహ్రెయిన్ లో పర్యటించి అక్కడ్నుంచి యూఏఈ, సీషెల్స్ దేశాలకు వెళ్తారు. విదేశాంగ మంత్రిగా తొలిసారిగా బహ్రెయిన్ పర్యటిస్తున్న ఆయన రెండు రోజుల పాటు( 24, 25 ) ఆ దేశ నేతలతో వరుస సమావేశాల్లో పాల్గొంటారు. భారత ప్రభుత్వం, భారత ప్రజల తరపున బహ్రెయిన్ దివంగత ప్రధానమంత్రి ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ బిన్ ఖలీఫా మృతికి ప్రగాఢ సానుభూతి తెలుపనున్నారు. అలాగే రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ పరణామాలు, ఇరు దేశాల ప్రయోజనాలకు సంబంధించి చర్చించనున్నారు.
బహ్రెయిన్ పర్యటన తర్వాత కేంద్రమంత్రి నేరుగా యూఏఈ చేరుకుంటారు. 25 నుంచి 26 వరకు తన రెండ్రోజుల పర్యటలో యూఏఈ విదేశాంగ మంత్రితో సమావేశం అవుతారు. యూఏఈ-భారత్ మధ్య వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ప్రస్తుతం అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లపై చర్చిస్తారు. అలాగే కోవిడ్ నేపథ్యంలో యూఏఈలోని భారతీయులు ఉపాధి కొల్పోయిన విషయాన్ని కూడా జయశంకర్...ఆ దేశ విదేశాంగమంత్రితో ప్రస్తావించనున్నారు. కోవిడ్ సంక్షోభం కారణంగా ఉపాధి కొల్పోయిన వార్ని తిరిగి ఉద్యోగాల్లో చర్చుకునే అవకాశాలపై చర్చిస్తారు. యూఏఈలో పర్యటన తర్వాత అటు నుంచి సీషెల్స్ చేరుకుంటారు. ఈ నెల 27 నుంచి 28 వరకు సీషెల్స్ లో పర్యటిస్తారు. ఆ దేశ ప్రెసిడెంట్ గా ఎన్నికైన వవెల్ రామ్ కలావన్ కు భారత ప్రధాని తరపున శుభాకాంక్షలు తెలుపుతారు. సీషెల్స్-భారత్ మధ్య సత్సంబంధాలపై కొత్త ప్రభుత్వంతో చర్చిస్తారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







