రోడ్డు ప్రమాదం కారణంగా తలెత్తిన ట్రాఫిక్‌ జామ్‌

- November 24, 2020 , by Maagulf
రోడ్డు ప్రమాదం కారణంగా తలెత్తిన ట్రాఫిక్‌ జామ్‌

మస్కట్‌: రెండు కార్లు ప్రమాదానికి గురికాగా, ఈ ప్రమాదంతో రోడ్డుపై ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. సుల్తాన్‌ కబూస్‌ స్ట్రీట్‌పై ఈ ఘటన చోటు చేసుకుంది. మస్కట్‌ వైపు వెళ్ళే దారిలో ఎయిర్‌ పోర్ట్‌ బ్రిడ్జికి ముందు సుల్తాన్‌ కబూస్‌ స్ట్రీట్‌పై రోడ్డు ప్రమాదం జరిగిందనీ, ఈ ఘటనలో కొందరికి గాయాలయ్యాయనీ, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. అత్యవసర పనుల మీద వెళ్ళేవారు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాలని సూచించారు.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com