బహ్రెయిన్‌కి పొంచి వున్న మిడతల దండు ప్రమాదం

- November 24, 2020 , by Maagulf
బహ్రెయిన్‌కి పొంచి వున్న మిడతల దండు ప్రమాదం

సౌదీ అరేబియా నుంచి దూసుకొస్తున్న గాలుల నేపథ్యంలో వాటితోపాటు మిడతల దండు కూడా బహ్రెయిన్‌కి వచ్చే అవకాశం వున్నట్లు అనుమానిస్తున్నారు. ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (FAO) - లోకస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌ - ఐక్యరాజ్యసమితి వెల్లడించిన తాజా వివరాల ప్రకారం, వేడి గాలులతోపాటుగా సౌదీ అరేబియాలోని రియాద్‌కి వారం రోజుల క్రితం మిడతల దండు వచ్చినట్లుగా తెలుస్తోంది. వీటితోపాటుగా కువైట్‌కి కూడా కొన్ని మిగతలు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. ఆదివారం నుంచి ఈ గాలులు అరేబియన్‌ గల్ఫ్‌ మరియు తూర్పు సౌదీ అరేబియా నుంచి బహ్రెయిన్‌ వైపు వస్తున్నట్లు తెలుస్తోంది. వాటితోపాటు వచ్చే మిడతలు ఆహార పంటల్ని నాశనం చేస్తాయని సంబంధిత అథారిటీస్‌ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి సన్నద్ధతతో ఆయా శాఖలు పనిచేస్తున్నట్లు అధికారులు వివరించారు. భయపడాల్సిన పనేమీ లేదనీ, డిపార్ట్‌మెంట్‌ పూర్తిస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తోందని అన్నారు. మిడతల దండు రోజులో 150 కిలోమీటర్ల దూరం ఎగిరే అవకాశం వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com