శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
- November 24, 2020
తిరుమల:భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కుటుంబసమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తిరుపతికి చేరుకున్న ఆయన, మధ్యాహ్ననం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహాద్వారం వద్ద ఇఫ్తికపాల్ ఆలయ మర్యాదలతో కోవింద్‌కు పూర్ణకుంభ స్వాగతం పలికారు. కాగా, రంగనాయక మంటపం వద్ద రాష్ట్రపతికి వేదపండితులు ఆశీర్వచనాలు చేశారు. అనంతరం రాష్ట్రపతి దంపతులకు తీర్థప్రసాదాలు, శ్రీవారి శేషవస్త్రాన్ని అందజేశారు.
అంతకుముందు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రాష్ట్రపతి వెంట రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉన్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న రాష్ట్రపతి దంపతులకు టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డితో సహా తదితరులు, అర్చక బృందంతో కలిసి ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వస్త్రం, తీర్థప్రసాదాలను వారికి ఛైర్మన్ అందించారు.
ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శనార్థం తిరుమలకు కుటుంబ సమేతంగా వచ్చిన భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు రేణిగుంట ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. ఉదయం 10.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు, టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు