డిసెంబర్ చివరి నాటికి కువైట్ కు కోవిడ్ వ్యాక్సిన్..ప్రకటించిన ఫైజర్

- November 24, 2020 , by Maagulf
డిసెంబర్ చివరి నాటికి కువైట్ కు కోవిడ్ వ్యాక్సిన్..ప్రకటించిన ఫైజర్

కువైట్ సిటీ:కోవిడ్ 19 వ్యాక్సిన్ తయారీలో 90 శాతం సక్సెస్ సాధించినట్లు ప్రకటించిన ఫైజర్-బయోన్ టెక్...వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. క్లినికల్ ట్రయల్స్ ముగించుకొని తుది అనుమతులు వచ్చిన మరు క్షణం నుంచే కువైట్ కు కోవిడ్ 19 వ్యాక్సిన్ BNT162 సరఫరా చేస్తామని స్పష్టం చేసింది. కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖతో ఒప్పందం చేసుకున్న మేరకు ఈ ఏడాది చివరి వరకల్లా కువైట్ కు వ్యాక్సిన్ అందించగలమని ధీమా వ్యక్తం చేసింది. విడతల వారీగా 2021లో కూడా వ్యాక్సిన్ ను సరఫరా చేస్తామని వెల్లడించింది. వ్యాక్సిన్ సరఫరాలో కవైట్ కు అధిక ప్రధాన్యత ఇస్తామని గల్ఫ్ దేశాల్లో ఫైజర్ బిజినెస్ హెడ్ స్పష్టం చేశారు. సరిపోయినన్ని డోస్ లను కువైట్ కు సరఫరా చేస్తామని, ఇది తమ బాధ్యతగా కూడా భావిస్తున్నట్లు తెలిపారు. అందుకు తగిన సాంకేతిక సహాయాన్ని కూడా అందిస్తామని అన్నారు. తమ కంపెనీ వ్యాక్సిన్ పై కువైట్ ప్రభుత్వం ముందు నుంచి చూపిన నమ్మకం పట్ల తాము ఎప్పటికీ మరువలేమని అన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయబోమని..ఫైజర్ వ్యాక్సిన్ కువైట్ ప్రజలను కోవిడ్ నుంచి విముక్తి కలిగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే..వ్యాక్సిన్ పట్ల ఫైజర్-బయోన్ టెక్ ప్రయోగం పట్ల కువైట్ సంతృప్తిని వ్యక్తం చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com